KTR: పార్టీలకు అతీతంగా ఫిర్యాదులు స్వీకరించండి: కేటీఆర్‌

పౌరసేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Updated : 16 Jun 2023 13:19 IST

హైదరాబాద్‌: పౌరసేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పురపాలనలో మరో సంస్కరణకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని చెప్పారు. కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఒక్కో వార్డులో పది మంది అధికారులు అందుబాటులో ఉంటూ ప్రజలుకు మెరుగైన, సులభమైన సేవలు అందిస్తారని చెప్పారు. 

ప్రజలు కేంద్రంగా పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్‌ అన్నారు. ఇకపై వార్డు కార్యాలయాల్లో కనీస పౌరసేవలు, ఫిర్యాదులు పరిష్కారమవుతాయని చెప్పారు. సిటిజన్‌ ఛార్టర్‌కు అనుగుణంగా ప్రజలకు సేవలు అందుతాయన్నారు. దేశం మొత్తం మన వైపు చూస్తోందని.. ఈ కార్యక్రమం విజయవంతమైతే దేశంలోని అన్ని చోట్ల నుంచి హైదరాబాద్‌కు వచ్చి నేర్చుకుని వెళ్లే పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ ఎన్నో రంగాల్లో దేశానికి ఆదర్శంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా ఫిర్యాదులను స్వీకరించాలని.. తరతమ భేదాలు చూపొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బందిని కేటీఆర్‌ ఆదేశించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని