KTR: ఇప్పుడు బండి సంజయ్‌ని మేమేం చేయాలి?: కేటీఆర్‌

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడంపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు.

Updated : 11 Aug 2023 10:04 IST

హైదరాబాద్‌: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడంపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల రైతులకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదలకు ఫలితం వచ్చిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు యుద్ధప్రాతిపదికన పూర్తవుతుందని పేర్కొన్నారు. మరోవైపు, సీఎం కేసీఆర్‌ను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ లోక్‌సభలో అసభ్యకరంగా దూషించారని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రధాని ఇంటి పేరు అవమానించారని కాంగ్రెస్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. కేసీఆర్‌ను దూషించిన బండి సంజయ్‌ను మేమేం చేయాలి?ఇప్పుడు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా ఏం చేస్తారు?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని