నా తల్లిని అవమానపరుస్తారా?: బండి సంజయ్‌పై మంత్రి పొన్నం ఆగ్రహం

భాజపా ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) తన తల్లిని అవమానపరిచేలా మాట్లాడారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam prabhakar) అన్నారు.

Updated : 28 Feb 2024 13:33 IST

హైదరాబాద్‌: భాజపా ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) తన తల్లిని అవమానపరిచేలా మాట్లాడారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam prabhakar) అన్నారు. రాజకీయాలతో ఆమెకు ఏమైనా సంబంధముందా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

‘‘ఎంపీగా తెలంగాణ, హుస్నాబాద్‌కు ఏం చేశావని ప్రశ్నిస్తే నా తల్లి ఆత్మక్షోభిస్తుందని మాట్లాడతారా? బతికున్న ఆమెను అవమానపరుస్తారా?మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయావు. నా దయాదాక్షిణ్యాల మీద అర్బన్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ అయ్యావు.. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావా?.. జాగ్రత్త!’’ అని బండి సంజయ్‌ను ఉద్దేశించి పొన్నం ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని