Ponnam: ఫులే విగ్రహం పేరుతో కవిత రాజకీయం: మంత్రి పొన్నం

భారాస ఎమ్మెల్సీ కవితపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. భారాస పదేళ్ల పాలనలో మహాత్మా జ్యోతిబాఫులే గుర్తుకు రాలేదా? అంటూ ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు.

Published : 31 Jan 2024 12:40 IST

హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్సీ కవితపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. భారాస పదేళ్ల పాలనలో మహాత్మా జ్యోతిబాఫులే గుర్తుకు రాలేదా? అంటూ ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు.

భారాసలో పార్టీ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన తర్వాతే సామాజిక న్యాయం గురించి మాట్లాడాలని హితవు పలికారు. ఫులే విగ్రహం పేరుతో కవిత రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంపై మాట్లాడేటప్పుడు అక్కడి పరిధులు తెలుసుకుని మాట్లాడాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని