Ponnam Prabhakar: అవినీతి పునాదులపై భారాస నిర్మాణం: పొన్నం ప్రభాకర్‌

అవినీతి పునాదులపై భారాస పార్టీని నిర్మించారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు.

Published : 25 Mar 2024 18:57 IST

జహీరాబాద్‌: నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారం కోల్పోయిన వంద రోజుల్లోనే భారాస కుప్పకూలుతోందని వ్యాఖ్యానించారు. జహీరాబాద్‌లో నిర్వహించిన  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి పునాదులపై భారాస పార్టీని నిర్మించారని విమర్శించారు. నిర్వీర్యమైన ఆర్టీసీకి కాంగ్రెస్ తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో పూర్వ వైభవం వచ్చిందని అన్నారు. త్వరలోనే 200 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం.. భాజపా, భారాస పార్టీల రాజకీయ ఎత్తుగడేనని పొన్నం ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని