Nominated MLCs: గవర్నర్‌ తీరుపై భారాస మంత్రుల అంసతృప్తి

నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తిరస్కరించడంపై ప్రశాంత్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Published : 25 Sep 2023 16:37 IST

హైదరాబాద్: రాజకీయ నాయకులైతే గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా పనికిరారా? అని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రశ్నించారు. నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తిరస్కరించడంపై ప్రశాంత్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘తమిళిసై భాజపా రాష్ట్ర అధ్యక్షురాలి నుంచి నేరుగా గవర్నర్‌ కాలేదా? సర్కారియా కమిషన్‌ సిఫార్సులు పాటించాలని గతంలో చెప్పిన ప్రధాని మోదీ.. వాటిని తుంగలో తొక్కి మిమ్మల్ని గవర్నర్ చేయలేదా? మీకు నైతికత ఎక్కడిది? అలా అయితే మొదట మీరే రాజీనామా చేయాలి’’ అని ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి స్పందిస్తూ.. ‘‘గ‌వ‌ర్నర్‌ చ‌ర్య స‌మాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు లాంటిది. ఆమె రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా రాష్ట ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. గ‌తంలో ఏ గవర్నర్‌ ఇలా చేయలేదు. రాజ‌కీయ క‌క్షసాధింపులకు పాల్పడటం స‌రికాదు’’ అని మంత్రి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని