కక్షపూరితంగానే ‘మమత’ విద్యార్థులపై ఈసీకి తుమ్మల ఫిర్యాదు: మంత్రి పువ్వాడ

దొంగ ఓట్ల నమోదుపై ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) లేఖ రాయడంపై మంత్రి, భారాస అభ్యర్థి పువ్వాడ అజయ్‌ కుమార్‌ స్పందించారు.

Published : 07 Nov 2023 11:35 IST

ఖమ్మం: దొంగ ఓట్ల నమోదుపై ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) లేఖ రాయడంపై మంత్రి, భారాస అభ్యర్థి పువ్వాడ అజయ్‌ కుమార్‌ స్పందించారు. కక్షపూరితంగానే మమత వైద్య కళాశాల విద్యార్థుల ఓట్లపై తుమ్మల ఈసీకి ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ‘‘తుమ్మలకు ఓటు వేస్తే మంచి ఓటు.. లేకపోతే దొంగ ఓటా? తుమ్మలకు ఓటువేసేవారికే ఓటు ఉండాలా? 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేయొచ్చు. మమత వైద్య కళాశాల విద్యార్థులు ఓట్లు నమోదు చేసుకుంటే తప్పా?’’ అని మంత్రి పువ్వాడ ప్రశ్నించారు. 

ఖమ్మం జిల్లాలో ఇంటి నంబర్లు లేకుండా ఓట్లు నమోదు చేశారని సోమవారం తుమ్మల ఆరోపించారు. దొంగ ఓట్లు నమోదు చేశారంటూ ఫిర్యాదుతో కూడిన లేఖను ఈసీకి పంపారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌, సీఈవో ఇతర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇంటి నంబర్లు లేకుండా నమోదు చేసిన ఓట్లను వెంటనే తొలగించి.. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీని తుమ్మల కోరిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని