అడ్వకేట్ వామన్‌రావు దంపతుల హత్యపై విచారణ జరిపిస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు

తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణిల హత్యలపై విచారణ జరిపిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) అన్నారు.

Published : 17 Dec 2023 22:15 IST

పెద్దపల్లి: తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణిల హత్యలపై విచారణ జరిపిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి మంథనికి శ్రీధర్‌బాబు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘‘హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారు. అడ్వకేట్ వామన్‌రావు దంపతుల హత్యలో ప్రత్యక్ష, పరోక్ష పాత్రధారులపై కచ్చితంగా విచారణ చేయిస్తాం. హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తాం. ప్రస్తుతం రాష్ట్ర ఖాజానా ఖాళీగా ఉంది. ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయం సమకూర్చుకుని అభివృద్ధి, సంక్షేమం అందిస్తాం’’ అని శ్రీధర్‌బాబు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని