Srinivas Goud: మోదీ క్షమాపణ చెప్పి సభలో మాట్లాడాలి: శ్రీనివాస్‌గౌడ్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకీ పాలమూరులో అడుగుపెట్టే అర్హత లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

Updated : 30 Sep 2023 12:03 IST

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకీ పాలమూరులో అడుగుపెట్టే అర్హత లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మోదీ మహబూబ్‌నగర్‌ పర్యటనపై మంత్రి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న వాళ్లు పాలమూరుకు వస్తున్నారు. తెలంగాణ అంటేనే విషం చిమ్మేవాళ్లు రాష్ట్రానికి వచ్చి ఏం చేస్తారు?  రాష్ట్ర ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పి సభలో మాట్లాడాలి.

కర్ణాటకలో కాంగ్రెస్‌ ‘రాజకీయ ఎన్నికల పన్ను’: మంత్రి కేటీఆర్‌

రేపు ప్రధాని ప్రసంగించే సమయంలో పరిసరాలను చూడాలి. చుట్టుపక్కల చూస్తే ప్రాజెక్టులు, రిజర్వాయర్‌లు, చెరువులు కనిపిస్తాయి. కేసీఆర్‌ పాలనలో అటవీ సంపద పెరిగిపోయింది. భాజపా నేతలు కులమతాల మధ్య వివాదాలు సృష్టిస్తున్నారు’’ అని శ్రీనివాస్‌ గౌడ్‌ ఆరోపించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని