మేడిగడ్డ బ్యారేజీపై కేసీఆర్‌ ఒక్క మాటా మాట్లాడలేదు: మంత్రి ఉత్తమ్‌

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్‌ మూడేళ్లకే కుంగిపోవటం అత్యంత బాధాకరమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy) అభిప్రాయపడ్డారు.

Updated : 29 Dec 2023 20:35 IST

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్‌ మూడేళ్లకే కుంగిపోవటం అత్యంత బాధాకరమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy) అభిప్రాయపడ్డారు. మేడిగడ్డ ఘటనకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి ఆయన బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రాజెక్టులో జరిగిన నష్టానికి కట్టిన వారే బాధ్యత వహించాలి. మేడిగడ్డ బ్యారేజీ అక్టోబర్ 21న కుంగితే.. డిసెంబర్‌ 3న ప్రభుత్వం మారేవరకు అప్పటి సీఎం కేసీఆర్‌ దానిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మేడిగడ్డ కుంగటం వల్ల ఎస్‌ఆర్‌ఎస్‌పీ ఆయకట్టు మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి పరిస్థితిని అంచనా వేయనున్నాం. తక్కువ నష్టం జరిగి ఉండాలనే మేమూ కోరుకుంటున్నాం’’ అని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని