Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై వారం రోజుల్లో న్యాయవిచారణ: మంత్రి ఉత్తమ్‌

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై వారం రోజుల్లో న్యాయవిచారణకు ఆదేశిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి వెల్లడించారు.

Updated : 02 Jan 2024 20:56 IST

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై వారం రోజుల్లో న్యాయవిచారణకు ఆదేశిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తప్పుచేసిన వారిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో భారాస నేతలను కాపాడేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం యత్నిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి చేసిన ఆరోపణలను మంత్రి కొట్టిపారేశారు. హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు.

‘‘పదేళ్ల పాటు భాజపా, భారాస కలిసే పనిచేశాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వమే మద్దతు ఇచ్చింది. కాళేశ్వరంపై కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లు స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ప్రాజెక్టుకు రుణం ఇచ్చింది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయి నెలలు గడుస్తున్నా.. కిషన్‌ రెడ్డి ఆ ప్రాజెక్టును ఎందుకు పరిశీలించలేదు? దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడే దర్యాప్తు సంస్థలు.. భారాస సర్కారుపై విచారణ జరిపితే ఎవరైనా ఆపారా?’’ అని ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని