Congress: లోక్‌సభ ఎన్నికల్లో 14 స్థానాలు గెలుస్తాం: మంత్రి ఉత్తమ్‌

గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ ప్రారంభించామని, అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated : 26 Jan 2024 17:24 IST

సూర్యాపేట: గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ ప్రారంభించామని, అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సులో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పాల్గొని.. దర్గా అభివృద్ధికి రూ.కోటి ప్రకటించారు.

మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల తర్వాత భారాస మరింత బలహీనమవుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ 14 లోక్‌సభ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారాస ఒకట్రెండు స్థానాలకే పరిమితమవుతుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపా మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని