Uttam Kumarreddy: సోనియా, రాహుల్‌ను కలిసిన మంత్రి ఉత్తమ్‌.. ఎంపీ పదవికి రాజీనామా

తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు.

Published : 13 Dec 2023 16:22 IST

దిల్లీ: తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. తన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి దిల్లీకి వెళ్లిన ఆయన.. 10 జన్‌పథ్‌లో సోనియా గాంధీని కలిశారు. అనంతరం అక్కడి నుంచి పార్లమెంట్‌కు వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్‌  ఓం బిర్లాకు అందజేశారు. ఈ విషయాన్ని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేసుకున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా ఎన్నికైన ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని