Andhra news: పోస్టల్‌ బ్యాలెట్‌పై ఈసీ స్పష్టత ఇచ్చింది: తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు

పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో వైకాపా అర్థంలేని ఆరోపణలు చేస్తోందని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు.

Published : 30 May 2024 22:22 IST

అమరావతి: పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో వైకాపా అర్థంలేని ఆరోపణలు చేస్తోందని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు. పోస్టల్‌ బ్యాలెట్‌పై గెజిటెడ్‌ సంతకం, స్టాప్‌ ఉండాలనే నిబంధన లేదన్నారు. ఈసీ సడలింపులతో అక్రమాలు జరుగుతాయనే వాదన అసంబద్ధమని కొట్టిపారేశారు. ఈసీ సడలింపు ఇవ్వలేదని, నిబంధనలపై స్పష్టత ఇచ్చిందని తెలిపారు. గెజిటెడ్‌ అధికారులను ఈసీ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిందన్నారు. ఈసీ నియమించిన అధికారులే పోస్టల్‌ బ్యాలెట్‌ను నిర్ధరిస్తూ సంతకం పెట్టారని గుర్తు చేశారు. సదరు అధికారి సంతకం చాలు అని ఈసీ స్పష్టత ఇచ్చిందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే నిబంధన అమల్లో ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు