MLC Kavitha: భారాస టికెట్ల కేటాయింపు.. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత కౌంటర్‌

వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా భారాస ప్రకటించిన టికెట్లపై తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్‌ ఇచ్చారు.

Updated : 22 Aug 2023 11:52 IST

హైదరాబాద్‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా భారాస ప్రకటించిన టికెట్లపై తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్‌ ఇచ్చారు. ‘‘మహిళా రిజర్వేషన్లపై కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా 2 సార్లు మోసం చేసింది. సంఖ్యాబలం ఉన్నా భాజపా మహిళా బిల్లును ఎందుకు ఆమోదించట్లేదు? చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల బిల్లును భాజపా తీసుకురావాలి. చట్టం ఉన్నందునే స్థానిక సంస్థల్లో 14 లక్షల మంది మహిళలకు ప్రాతినిధ్యం దక్కింది. మీ రాజకీయ అభద్రతను మహిళా ప్రాతినిధ్యానికి ముడి పెట్టొద్దు’’ అంటూ కవిత మండిపడ్డారు.  

కిషన్‌ రెడ్డి ఏమన్నారంటే..?

రాష్ట్రంలో రోజురోజుకు భాజపాకు పెరుగుతున్న ఆదరణతో ముఖ్యమంత్రి కేసీఆర్‌లో ఆందోళన మొదలైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. భారాస విడుదల చేసిన అభ్యర్థుల జాబితా చూస్తుంటే ఈసారి అధికారంలోకి రాలేమని సీఎం కేసీఆర్‌కు అర్థమైనట్లు ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ మెజారిటీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఇవ్వడం ద్వారా సీఎం కేసీఆర్‌ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. భాజపా భయంతోనే గజ్వేల్‌తోపాటు ఉత్తర తెలంగాణలోని కామారెడ్డిలో పోటీ చేయాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ దీక్షలు చేసిన వారు తెలంగాణలో 7 స్థానాలు మాత్రమే మహిళలకు ఇచ్చారు. 33 శాతం అంటే ఏడు సీట్లేనా?’’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు