MLC kavitha: ప్రియాంకా గాంధీని ఏ హోదాలో పిలుస్తున్నారు?: కవిత

హామీల అమలుకు ప్రియాంకా గాంధీని ఏ హోదాలో పిలుస్తున్నారని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని భారాస ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

Updated : 03 Feb 2024 12:21 IST

హైదరాబాద్‌: హామీల అమలుకు ప్రియాంకా గాంధీని ఏ హోదాలో పిలుస్తున్నారని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని భారాస ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వ కార్యక్రమాలకు ఏ పదవీ లేని ప్రియాంకను ఎలా పిలుస్తారు..? ఆమెను పిలిస్తే నిరసన తెలుపుతాం. ఝార్ఖండ్‌ ఎమ్మెల్యేలను ప్రభుత్వ ఖర్చుతో హైదరాబాద్‌ తరలించారు. రోజూ ప్రజలను కలుస్తానని సీఎం అన్నారు. ఒక్క రోజే ప్రజలను కలిశారు. ప్రజాదర్బార్‌ అన్నారు.. అక్కడికి వెళ్లడం లేదు. ఆయనను యూటర్న్‌ సీఎం అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు’ అని కవిత విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని