TS Budget: కాంగ్రెస్‌ నేమ్‌ ఛేంజర్‌ మాత్రమే.. గేమ్‌ ఛేంజర్‌ కాదు: కవిత

తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన ఓట్‌ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై భారాస నేత, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. బడ్జెట్‌లో పూర్తి కేటాయింపులు లేవని విమర్శించారు.

Updated : 10 Feb 2024 16:55 IST

హైదరాబాద్‌: శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై భారాస నేత, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. బడ్జెట్‌లో పూర్తి కేటాయింపులు లేవని విమర్శించారు. ఎన్నికల హామీల గురించి బడ్జెట్‌లో చెప్పలేదన్నారు. గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే సమావేశాలు నిర్వహించినట్లు ఉందన్నారు. పథకాలకు పాత పేర్లు తీసి కొత్త పేర్లు పెట్టారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓన్లీ నేమ్‌ ఛేంజర్‌ మాత్రమేనని.. గేమ్‌ ఛేంజర్‌ కాదని కవిత వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని