Kavitha: రిజర్వేషన్లలో మహిళలకు అన్యాయంపై ఈనెల 8న నిరసన: ఎమ్మెల్సీ కవిత

ఉద్యోగ రిజర్వేషన్లలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్యాయం చేస్తోందని భారాస ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.

Published : 04 Mar 2024 15:03 IST

హైదరాబాద్‌: ఉద్యోగ రిజర్వేషన్లలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్యాయం చేస్తోందని భారాస ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. గురుకుల నియామకాల్లో ఆడబిడ్డలకు న్యాయం జరగలేదన్నారు. 626 ఉద్యోగాల్లో 77 మాత్రమే మహిళలకు వచ్చాయని చెప్పారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈనెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయంపై నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. ధర్నా చౌక్‌లో భారత జాగృతి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తామన్నారు. ‘‘జీవో నం.3 వల్ల 33 శాతం రావాల్సిన రిజర్వేషన్‌.. 12 శాతమే దక్కుతోంది. వెంటనే ఆ జీవోని సీఎం రేవంత్‌రెడ్డి రద్దు చేయాలి. ఇప్పుడు ఇస్తున్న ఉద్యోగాలన్నీ కేసీఆర్‌ హయాంలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించినవే. రేవంత్‌ సర్కార్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ మాత్రమే ఇచ్చింది’’అని కవిత అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని