Kalvakuntla Kavitha: రేపు విచారణకు హాజరుకాలేను: సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ

దిల్లీ మద్యం కేసులో దర్యాప్తునకు సంబంధించి మంగళవారం విచారణకు హాజరు కాలేనని సీబీఐకి తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.

Updated : 05 Dec 2022 11:26 IST

హైదరాబాద్: దిల్లీ మద్యం కేసులో దర్యాప్తునకు సంబంధించి మంగళవారం విచారణకు హాజరు కాలేనని సీబీఐ(CBI)కి తెరాస(TRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla kavitha) తెలిపారు. ఈ మేరకు సీబీఐ అధికారులకు ఆమె లేఖ రాశారు. ముందుగా ఖరారైన కార్యక్రమాల కారణంగా హాజరుకాలేనని లేఖలో కవిత పేర్కొన్నారు. ఈనెల 11, 12, 14, 15 తేదీలలో అందుబాటులో ఉంటానని తెలిపారు.

మద్యం కేసులో కేంద్రహోంశాఖ ఇచ్చిన ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్‌ ప్రతులు ఇవ్వాలని ఇటీవల సీబీఐని కవిత కోరారు. దీంతో సీబీఐ అధికారులు.. వెబ్‌సైట్‌లో ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఉందని ఈమెయిల్‌ ద్వారా ఆమెకు తెలిపారు. దీనిపై స్పందించిన కవిత.. మళ్లీ సీబీఐకు లేఖ రాశారు. ‘‘సీబీఐ వెబ్‌సైట్‌లో ఎఫ్‌ఐఆర్‌ కాపీని క్షుణ్ణంగా పరిశీలించా.. అందులో నా పేరు లేదు. అయినా విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా. ముందుగా ఖరారైన కార్యక్రమాల దృష్ట్యా మంగళవారం (6వ తేదీ) విచారణకు హాజరుకాలేను. ఈ నెల 11, 12, 14, 15 తేదీలలో అందుబాటులో ఉంటాను’’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని