Jairam Ramesh: మోదీ త్వరలో లాంగ్ లీవ్‌పై వెళ్తారు.. ఇది ప్రజల గ్యారంటీ: జైరాం రమేశ్‌

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ మండిపడ్డారు.

Published : 08 Apr 2024 00:09 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్‌ (Congress) ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌(Jairam Ramesh) మండిపడ్డారు. జూన్‌ 4 తర్వాత మోదీ ఇక లాంగ్‌ లీవ్‌ తీసుకోవాల్సి ఉంటుందని, ఇది భారత ప్రజల గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. గడిచిన పదేళ్లలో ఎలాంటి హామీలు నెరవేర్చకపోవడంతో నిరాశలో ఉన్న మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏదిపడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రధాని పదేళ్ల నుంచి చెబుతున్న అబద్ధాలతో దేశ ప్రజలు విసిగి పోయారన్నారు. పదేళ్ల అన్యాయం తర్వాత కాంగ్రెస్‌ ప్రవేశ పెట్టిన ‘పాంచ్ న్యాయ్ పచీస్ గ్యారెంటీ’ భారత ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తించిందని పేర్కొన్నారు. తన కుర్చీని కాపాడుకోవడానికే ప్రధాని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జైరాం రమేశ్ ఆరోపించారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు కాంగ్రెస్‌ ఓ గొంతుకగా ఉందన్నారు. ఆదివారం బిహార్‌లోని నవాడా జిల్లాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ‘కాంగ్రెస్‌ విడుదల చేసిన మేనిఫెస్టో ముస్లిం లీగ్‌ ముద్రలా ఉంది. అది ఎన్నికల మేనిఫెస్టో కాదు. బుజ్జగింపు ప్రకటన’ అంటూ చేసిన ఆరోపణలపై తాజాగా జైరాం రమేశ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని