AP News: సీఎస్‌ భారీగా భూఅక్రమాలకు తెరలేపారు: జనసేన నేత మూర్తి యాదవ్‌

రాష్ట్రంలో ఎన్నికల హింసపై విచారణ జరుగుతుంటే సీఎస్‌ విశాఖలో భూ అక్రమాలకు పాల్పడుతున్నారని జనసేన నేత పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు.

Updated : 25 May 2024 14:11 IST

విశాఖ: రాష్ట్రంలో ఎన్నికల హింసపై విచారణ జరుగుతుంటే సీఎస్‌ విశాఖలో భూ అక్రమాలకు పాల్పడుతున్నారని జనసేన నేత పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు. 4 రోజుల క్రితం భూముల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చి భోగాపురం ఎయిర్‌పోర్టుపై సమీక్ష అని చెప్పారన్నారు. ‘‘నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న సీఎస్‌ జవహర్‌రెడ్డి భారీగా భూఅక్రమాలకు తెరలేపారు. ఉత్తరాంధ్రలో రూ.2 వేల కోట్ల విలువైన అసైన్డ్‌ భూములను కొట్టేశారు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాకే భూముల మార్పిడి జీవో 596 ఇచ్చారు. ఆ జీవో ఆధారంగానే సీఎస్‌ కుమారుడు విశాఖలో 800 ఎకరాలకు పైగా భూములు చేజిక్కించుకున్నారు. 

400 ఎకరాల ఎస్సీ, బీసీ అసైన్డ్‌ భూములను బినామీల పేరిట సొంతం చేసుకున్నారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లోని అసైన్డ్‌ భూములపై కన్నేసి కుమారుడిని రంగంలోకి దింపారు. ఎకరం రూ.2 కోట్లు పలికే భూములను ఐదారు లక్షలకే జవహర్‌రెడ్డి ముఠా ఒప్పందాలు చేసుకుంది. వైకాపా ప్రభుత్వం మళ్లీ రాదన్న భయంతో హడావుడి రిజిస్ట్రేషన్లకు సిద్ధమయ్యారు. ఈసీ జోక్యం చేసుకొని అక్రమ భూరిజిస్ట్రేషన్లు నిలిపివేయాలి. రాష్ట్రవ్యాప్తంగా మార్చి నుంచి జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలి. అసైన్డ్‌ భూములు కొట్టేసిన వైకాపా నేతలు, ఐఏఎస్‌లపై సీబీఐ విచారించాలి’’ అని పీతల మూర్తి యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు