Nadendla Manohar: తెదేపా-జనసేన ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్తాం: నాదెండ్ల మనోహర్‌

చంద్రబాబు అనుభవం, పవన్‌ కల్యాణ్‌ ఆలోచన రాష్ట్రానికి అవసరమని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

Updated : 18 Oct 2023 15:59 IST

కొత్తపేట: చంద్రబాబు అనుభవం, పవన్‌ కల్యాణ్‌ ఆలోచన రాష్ట్రానికి అవసరమని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. బుధవారం కోనసీమ జిల్లా కొత్తపేటలో నాదెండ్ల మనోహర్‌ పర్యటించారు. ప్రమాదవశాత్తూ మృతి చెందిన ఇద్దరు పార్టీ కార్యకర్తలకు రూ.5లక్షల ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో మాట్లాడిన మనోహర్‌.. తెదేపా-జనసేన ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్లబోతున్నట్టు వివరించారు. త్వరలోనే ఉమ్మడి ప్రణాళికతో ఇంటింటికీ వెళ్లే కార్యక్రమం చేపడతామన్నారు. వైకాపా విముక్త ఏపీ కోసం ప్రజలంతా కంకణం కట్టుకున్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని