Nakul Nath: లోక్‌సభ తొలిదశ ఎన్నికల్లో సంపన్న అభ్యర్థిగా నకుల్ నాథ్‌

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు, ఎంపీ నకుల్ నాథ్‌ అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.717 కోట్లు.

Updated : 10 Apr 2024 13:26 IST

దిల్లీ: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ నకుల్ నాథ్‌ (Nakul Nath) ఓ రికార్డు సృష్టించారు. తొలి దశలో పోలింగ్‌ జరగనున్న స్థానాల్లోని అభ్యర్థులందరిలోకి అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.717 కోట్లు. ఈ విషయాన్ని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకటించింది.

ఈ సంపన్న అభ్యర్థుల జాబితాలో తమిళనాడులోని ఈరోడ్ నుంచి పోటీ చేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థి అశోక్ కుమార్ రూ.662 కోట్ల ఆస్తులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. శివగంగ భాజపా అభ్యర్థి దేవనాథన్ యాదవ్ రూ.304 కోట్ల ఆస్తులతో తృతీయ స్థానంలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ఏప్రిల్ 19న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న చేపట్టనున్నారు. 

ఇటీవల ఎన్నికల నేపథ్యంలో కమల్‌నాథ్‌, నకుల్‌ నాథ్‌ కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరనున్నారనే ప్రచారం బలంగా జరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే కమల్ నాథ్ పార్టీ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారని రాజకీయ వర్గాలు తెలిపాయి. 50 ఏళ్ల క్రితం తాను కాంగ్రెస్‌లో చేరినప్పటికీ, ఇప్పటికీ విధానాలు, పని తీరులో మార్పులు చోటుచేసుకున్నట్లుగా ఆయన అగ్రనాయకత్వానికి తెలియజేశారు. ఈ పరిణామాల తర్వాత ఆయన పార్టీని వీడనున్నారనే వార్తలను కాంగ్రెస్‌ ఖండించింది.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని