Kuppam: చంద్రబాబు తరఫున నామినేషన్‌ వేసిన నారా భువనేశ్వరి

తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్‌ వేశారు.

Updated : 19 Apr 2024 14:40 IST

కుప్పం పట్టణం: తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్‌ వేశారు. కుప్పంలో రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)కి నామినేషన్‌ పత్రాలను ఆమె సమర్పించారు. అంతకుముందు భారీ ర్యాలీగా ఆర్వో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

తొలుత నిర్వహించిన ర్యాలీలో కార్యకర్తలను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడుతూ వైకాపా పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదన్నారు. ‘‘రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఆయన హయాంలో పెట్టుబడులకు చాలా మంది ముందుకొచ్చారు. ఇవాళ పరిశ్రమలు రాకపోగా.. ఉన్నవి పోయాయి. కులమతాలు వేరైనా మనమంతా ఆంధ్రులం. వైకాపా పాలనలో తెదేపా కార్యకర్తలను తీవ్రంగా వేధించారు. రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు. ఓటు అనే ఆయుధంతో రాక్షస పాలనను అంతం చేయాలి. అందరం కలిసి ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొద్దాం’’ అని భువనేశ్వరి పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని