Nara Lokesh: ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు.. సీఐడీ విచారణకు హాజరైన నారా లోకేశ్‌

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నేడు సీఐడీ విచారణకు హాజరయ్యారు.

Published : 10 Oct 2023 10:45 IST

అమరావతి: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నేడు సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఐదు నిమిషాల ముందే తాడేపల్లిలోని సిట్‌ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. 

ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయంటూ లోకేశ్‌కు ఇటీవల సీఐడీ నోటీసులు జారీ చేసింది. దీనిపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆయన ఈనెల 4న హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఉన్నత న్యాయస్థానం సీఐడికి పలు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. విచారణ సమయంలో లోకేశ్‌తో పాటు న్యాయవాదిని అనుమతించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫలానా దస్త్రాలతో రావాలని పిటిషనర్‌ను ఒత్తిడి చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే విచారించాలని.. మధ్యాహ్నం ఓ గంట భోజన విరామం ఇవ్వాలని సీఐడికి న్యాయస్థానం ఆదేశించింది. 

హెరిటేజ్ సంస్థకు లబ్ధిచేకూరేలా ఇన్నర్ రింగురోడ్డు అలైన్‌మెంట్ మార్చారని సీఐడీ అభియోగాలు మోపింది. లేని, వేయని, కనీసం భూసేకరణ కూడా చేయని ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి ఎలా సాధ్యమని తెదేపా నిలదీస్తోంది.  రాష్ట్ర విభజనకు ముందు.. రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలో హెరిటేజ్ సంస్థ కేవలం 9 ఎకరాల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంటే అవినీతి ఎలా అవుతుందని ప్రశ్నిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని