Nara Lokesh : అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?: నారా లోకేశ్‌

పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై వైకాపా కార్యకర్తల దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఖండించారు.

Updated : 01 Apr 2023 13:17 IST

రాప్తాడు : పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కారుపై వైకాపా కార్యకర్తల దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఖండించారు. దాడి ఘటన అనంతరం పుట్టపర్తి నేతలతో రాప్తాడు నుంచి లోకేశ్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ధ్వజమెత్తారు. సమాధానం చెప్పలేక దాడులకు దిగడం పిరికిపంద చర్య అని విమర్శించారు.

పుట్టపర్తిలో తెదేపా కార్యకర్తలపై దాడి చేశారని.. జగన్‌ అండతో వైకాపా రౌడీ మూకలు పేట్రేగిపోతున్నాయని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పల్లె రఘునాథరెడ్డి కారు ధ్వంసం చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. పుట్టపర్తిని వైకాపా ఎమ్మెల్యే అరాచకాలకు నిలయంగా మార్చారని ధ్వజమెత్తారు. వైకాపా రౌడీ మూకలు దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దాడి చేసిన వారిని వదిలేసి తెదేపా కార్యకర్తలపై లాఠీచార్జి చేస్తారా? అని  నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని