Tirumala: దైవంతో ఆటలొద్దు జగన్‌: నారా లోకేశ్‌

నియంత పాలనలో నోరువిప్పడమూ నేరమేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు.

Published : 26 Feb 2024 16:27 IST

విజయవాడ: నియంత పాలనలో నోరువిప్పడమూ నేరమేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వైకాపా నాయకులు చేస్తున్న అకృత్యాలను బయటపెట్టిన ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై వేటు వేయడం దారుణమని మండిపడ్డారు. కొండపై వైకాపా నేతలు, కొంత మంది అధికారులు కలిసి చేస్తున్న దారుణాలను.. ఆ కలియుగ దైవమే రమణ దీక్షితులు నోటి నుంచి భక్తులకు తెలిసేలా చేశారన్నారు. చేసిన తప్పులు, పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది పోయి ఆయనపై కేసు పెట్టడం, అరెస్ట్ చేయాలని చూడటం జగన్ అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు.

దేవుడి జోలికి వెళ్లిన వారెవరూ బాగుపడినట్టు చరిత్రలో లేదని, దైవంతో ఆటలొద్దు జగన్ అంటూ హెచ్చరించారు. రమణ దీక్షితులుపై తిరుమలలోని వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో రెండ్రోజుల కిందట కేసు నమోదైంది. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన మాట్లాడినట్లుగా ఉన్న ఓ వీడియో వివాదాస్పదం కావడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ వీడియో తనది కాదంటూ ఇప్పటికే ఎక్స్(ట్విటర్‌)లో రమణ దీక్షితులు పోస్టు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని