Nara Lokesh: ఆక్వా రైతులను జగన్‌ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీసింది: లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

Published : 28 Nov 2023 11:34 IST

అమలాపురం: జగన్‌ పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. కోనసీమ జిల్లా పేరూరు విడిది కేంద్రం నుంచి యువగళం 211వ రోజు పాదయాత్రను ఆయన ప్రారంభించారు. అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాలలో ఈ రోజు యాత్ర కొనసాగనుంది. ఇటీవల వైకాపాకు రాజీనామా చేసిన ఏలేశ్వరం, రౌతులపూడి ఎంపీపీలు లోకేశ్‌ సమక్షంలో తెదేపాలో చేరారు. అనంతరం ఆక్వారైతులతో ఆయన సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆక్వారైతులు, తమ ఆవేదనను లోకేశ్‌తో చెప్పుకొని వినతిపత్రం అందజేశారు. ‘‘ఆక్వా రైతులను జగన్‌ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీసింది. తెదేపా అధికారంలోకి వచ్చాక ఆక్వా రంగాన్ని ఆదుకుంటాం. ఫీడ్‌, సీడ్‌, విద్యుత్‌ ధరలు తగ్గేలా చర్యలు చేపడతాం. గిట్టుబాటు ధరకు అవసరమైన చర్యలు తీసుకుంటాం’’ అని లోకేశ్‌ హామీ ఇచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని