NDA: ఏపీలో ఎన్డీయేకు 15 లోక్‌సభ సీట్లు పెరుగుతాయి

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమికి కనీసం 15 లోక్‌సభ స్థానాలు పెరిగే అవకాశం ఉందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సెఫాలజిస్ట్‌ యోగేంద్రయాదవ్‌ తెలిపారు.

Published : 26 May 2024 04:47 IST

ఈ ఎన్నికల్లో తెదేపా బాగా పనిచేసింది
దేశవ్యాప్తంగా భాజపాకు 65 సీట్లు తగ్గే అవకాశం
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్రయాదవ్‌

ఈనాడు, దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమికి కనీసం 15 లోక్‌సభ స్థానాలు పెరిగే అవకాశం ఉందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సెఫాలజిస్ట్‌ యోగేంద్రయాదవ్‌ తెలిపారు. ఈ ఎన్నికల్లో తెదేపా బాగా పనిచేసినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఆయన ఇటీవల ప్రముఖ పాత్రికేయురాలు బర్కాదత్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్డీయే ఇదివరకు గెలిచిన స్థానాల్లో 100 సీట్లు కోల్పోయి, కొత్తగా 20 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉందని, మొత్తంగా 80 సీట్లు తగ్గుతాయని అంచనా వేశారు. ఇందులో 65 సీట్లు భాజపావి, 15 సీట్లు భాగస్వామ్యపక్షాలవి ఉంటాయని పేర్కొన్నారు. కొత్తగా ఏపీ, ఒడిశా, తెలంగాణలో ఎన్డీయే కూటమి పక్షాలు కనీసం 20 స్థానాలకుపైగా లాభపడనున్నట్లు తెలిపారు. అదే సమయంలో కర్ణాటకలో 10, రాజస్థాన్, గుజరాత్‌లో కలిపి 10, మహారాష్ట్రలో 20, హరియాణా, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, దిల్లీ, చండీగఢ్‌లో కలిపి 10, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌లో కలిపి 10, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్‌లో కలిపి 30, పశ్చిమబెంగాల్, ఈశాన్యరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 10 సీట్లు ఎన్డీయే కోల్పోనుందని వెల్లడించారు. ఒడిశా, తెలంగాణలో భాజపా 5 సీట్లు లాభపడుతుందన్నారు. కేరళ, తమిళనాడులో ఓట్లు పెరిగినా సీట్లు రావని అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో భాజపా సంఖ్యాబలం 240 వరకే పరిమితమవుతుందని అంచనా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని