Nellore: కోటంరెడ్డితోనే ప్రయాణం..ఆయనే మా ఊపిరి: నెల్లూరు మేయర్
నెల్లూరు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అధిష్ఠానంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి నెల్లూరు మేయర్ స్రవంతి మద్దతుగా నిలిచారు. ఆయన వెంటే నడుస్తామని స్పష్టం చేశారు.
నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy Sridhar Reddy)తోనే తమ ప్రయాణమని నెల్లూరు మేయర్ (Nellore mayor) పొట్లూరి స్రవంతి అన్నారు. అవసరమైతే నెల్లూరు మేయర్ పదవికి రాజీనామా చేస్తామని తెలిపారు. కార్పొరేటర్, మేయర్‌గా తాను ఎదగడానికి కోటంరెడ్డే కారణమని స్పష్టం చేశారు. ‘‘మా జెండా.. మా ఊపిరి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. ఆయన ఎటుంటే అటే నడుస్తాం’’ అని ఆమె తేల్చి చెప్పారు. ‘శ్రీధర్ అన్న నీతోనే నా రాజకీయ ప్రయాణం’ అని మేయర్ అన్న మాటలకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చలించి పోయారు.
గత కొద్ది రోజులుగా తనపై నిఘా పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అధికార పార్టీపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేయాలని లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నెల్లూరు మేయర్ స్రవంతి కోటంరెడ్డికి మద్దతు తెలుపుతూ ఆయన వెంటే నడుస్తామని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nara Lokesh : అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?: నారా లోకేశ్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Sanjay Raut: ‘దిల్లీకి వస్తే.. ఏకే-47తో కాల్చేస్తామన్నారు..’: సంజయ్ రౌత్
-
Sports News
MS DHONI: ధోనీ 15 ఏళ్ల కిందట ఉన్నంత దూకుడుగా ఉండలేడు కదా: సీఎస్కే కోచ్
-
General News
TSPSC paper leak: సిట్ విచారణకు హాజరైన టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్
-
Politics News
YS Sharmila : బండి సంజయ్, రేవంత్‌రెడ్డికి షర్మిల ఫోన్.. కలిసి పోరాడదామని పిలుపు