Modi Cabinet: తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రుల ప్రస్థానమిది
తండ్రి దివంగత ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్నాయుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. 2014లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్‌యాత్ర చేసి, పార్టీ శ్రేణులకు, ప్రజలకు చేరువయ్యారు.
కింజరాపు రామ్మోహన్నాయుడు
స్వస్థలం: నిమ్మాడ, కోటబొమ్మాళి మండలం, శ్రీకాకుళం జిల్లా
వయసు: 36 సంవత్సరాలు
విద్యార్హత: బీటెక్, ఎంబీఏ
తల్లిదండ్రులు: విజయలక్ష్మి, ఎర్రన్నాయుడు
భార్య: శ్రావ్య
రాజకీయ నేపథ్యం: తండ్రి దివంగత ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్నాయుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. 2014లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్‌యాత్ర చేసి, పార్టీ శ్రేణులకు, ప్రజలకు చేరువయ్యారు. ఆ ఎన్నికల్లో తెదేపా తరఫున తొలిసారి పోటీ చేసి 1.27 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు. 2019లో వైకాపా గాలిలోనూ నిలిచి రెండోసారి ఎంపీ అయ్యారు. ఈ ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.
పెమ్మసాని చంద్రశేఖర్
స్వస్థలం: బుర్రిపాలెం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా
వయసు: 47
విద్యార్హత: ఎంబీబీఎస్, ఎండీ (ఇంటర్నల్ మెడిసిన్)
తల్లిదండ్రులు: సువర్చల, పెమ్మసాని సాంబశివరావు
భార్య: డాక్టర్ శ్రీరత్న, కుమారుడు, కుమార్తె
అమెరికా వెళ్లి వైద్యవిద్యలో పీజీ చేశారు. అమెరికాలో లైసెన్సింగ్ ఎగ్జామ్స్‌కు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్ పేరుతో ఆన్లైన్ శిక్షణ సంస్థను స్థాపించి, దాన్ని వేల కోట్ల సంస్థగా తీర్చిదిద్దారు. తెదేపా ఎన్నారై విభాగం తరఫున క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైనా చివర్లో అవకాశం చేజారింది. ఈ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిత్వం దక్కించుకుని.. వైకాపా అభ్యర్థి కిలారి రోశయ్యపై భారీ మెజారిటీతో గెలిచారు.
భూపతిరాజు శ్రీనివాసవర్మ
స్వస్థలం: భీమవరం
వయసు: 59 సంవత్సరాలు
తల్లిదండ్రులు: సీతాలక్ష్మి, సూర్యనారాయణరాజు. తాత భూపతిరాజు బాపిరాజు స్వాతంత్ర సమరయోధులు
భార్య: వెంకటేశ్వరీదేవి
విద్యార్హత: ఎంఏ హిందీ, ఎంఏ (ఇంగ్లిష్), బీఎల్
వృత్తి: రొయ్య రైతు. స్థిరాస్తి వ్యాపారంలోనూ ఉన్నారు.
రాజకీయ నేపథ్యం: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భాజపా కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా, జోనల్ ఇన్ఛార్జిగా, పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పని చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
కిషన్‌రెడ్డిని రెండోసారి వరించిన కేంద్రమంత్రి పదవి
పేరు: గంగాపురం కిషన్‌రెడ్డి; పుట్టిన తేదీ: 15.6.1960
తల్లిదండ్రులు: ఆండాళ్లమ్మ, స్వామిరెడ్డి; భార్య: కావ్యారెడ్డి(గృహిణి)
పిల్లలు: వైష్ణవి, తన్మయ్(ఇద్దరూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు)
కఠోర శ్రమ, అంకితభావం, పనిచేస్తే ఏదైనా సాధించవచ్చనేందుకు నిలువెత్తు నిదర్శనం గంగాపురం కిషన్‌రెడ్డి. మూడుసార్లు ఎమ్మెల్యేగా.. రెండు సార్లు ఎంపీగా గెలిచి.. అందరివాడిగా పేరుతెచ్చుకున్న కిషన్‌రెడ్డిని మరోసారి కేంద్రమంత్రి పదవి వరించింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. అవినీతి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం సాగించిన లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ స్ఫూర్తితో బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృష్ణానది నుంచి గోదావరి నది వరకూ ‘తెలంగాణ పోరుయాత్ర’ నిర్వహించి 333 సమావేశాల్లో ప్రసంగించారు. 1977లో జనతాపార్టీ యువమోర్చా నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2004లో తొలిసారి హిమాయత్‌నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 మే నుంచి 2021 జులై వరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా 2021 జులై నుంచి కేంద్ర సాంస్కృతిక, పర్యటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు.
కార్యకర్త నుంచి కేంద్ర సహాయ మంత్రి దాకా...
పేరు: బండి సంజయ్‌కుమార్
పుట్టిన తేదీ: 11-7-1971
తల్లిదండ్రులు: శకుంతల, బండి నర్సయ్య
భార్య: బండి అపర్ణ (ఎస్బీఐ ఉద్యోగి)
పిల్లలు: సాయిభగీరథ్, సాయి సుముఖ్
కరీంనగర్ నుంచి దిల్లీ దాకా ఎదిగిన నేతగా బండి సంజయ్ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. బండి సంజయ్ స్వస్థలం కరీంనగర్. విద్యార్థి దశ నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో స్వయం సేవకుడిగా పని చేస్తూ ఏబీవీపీ పట్టణ కన్వీనర్‌గా, ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగారు. తరువాత భారతీయ జనతా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. ఆడ్వాణీ రథయాత్రలో ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2019లో తొలిసారిగా కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచారు. తరువాత భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం భాజపాలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తూ.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలిచారు. కేంద్ర సహాయ మంత్రి పదవిని దక్కించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్‌లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్‌బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్‌బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్‌లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(4)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్‌పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్‌ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్‌రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్‌కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్‌గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్‌కుమార్ డిమాండ్ చేశారు.