ఈవీఎంల ధ్వంసం.. ఇతరులెవరూ సాహసించని రీతిలో చర్యలు ఉండాలి: ఈసీకి నిమ్మగడ్డ ఫిర్యాదు

మాచర్ల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి ‘ఎలక్షన్‌ వాచ్‌’ కన్వీనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ ఫిర్యాదు చేశారు.

Published : 22 May 2024 12:02 IST

అమరావతి: మాచర్ల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి ‘ఎలక్షన్‌ వాచ్‌’ కన్వీనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ ఫిర్యాదు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియో దృశ్యాలను ఈసీకి అందించారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి పనులు ఇతరులెవరూ చేసేందుకు సాహసించని రీతిలో చర్యలు ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల రోజు పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్‌లను మాచర్ల ఎమ్మెల్యే నేలకేసి కొట్టి అరాచకం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ దురాగతానికి సంబంధించి సీసీ కెమెరాలో రికార్డయిన వీడియో మంగళవారం వెలుగులోకి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని