CPI Narayana: ఐక్యంగా తీసుకెళ్లడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం: సీపీఐ నేత నారాయణ

కాంగ్రెస్‌ పార్టీ అందరినీ ఐక్యంగా తీసుకెళ్లడం వల్లే తెలంగాణలో విజయం సాధించిందని సీపీఐ నేతలు అభిప్రాయపడ్డారు.

Updated : 05 Dec 2023 15:38 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అందరినీ ఐక్యంగా తీసుకెళ్లడం వల్లే తెలంగాణలో విజయం సాధించిందని సీపీఐ నేతలు అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ టూరిజం శాఖలో వందల కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ‘‘పర్యాటక శాఖ మంత్రి, ఎండీకి తెలిసే ఈ అవినీతి జరిగింది. ప్రభుత్వం మారిందని అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయాన్ని తగలబెట్టారు. కేంద్రంలోని భాజపా సర్కార్‌ వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది. ఏపీలో పొత్తులపై పార్టీల మధ్య స్పష్టత లేదు’’ అని నారాయణ వ్యాఖ్యానించారు.

సీపీఐతో పొత్తు.. కాంగ్రెస్‌కు కలిసొచ్చింది: కూనంనేని

సీపీఐ తెలంగాణ కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్‌ పదేళ్ల పాలనలో ఊపిరాడని నిర్బంధాలు జరిగాయి. బంగారు తెలంగాణను చేస్తానన్న కేసీఆర్‌.. ఒక్క హామీ అమలు చేయలేదు. నిర్బంధాలను సహించబోమని తెలంగాణ ప్రజానీకం స్పష్టమైన తీర్పునిచ్చింది. కాంగ్రెస్‌, సీపీఐ పొందిక బాగా కలిసొచ్చింది. తెదేపా, సీపీఎం, తెజస పార్టీలు మద్దతిచ్చాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు సీపీఐతో పొత్తు కలిసి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు విశ్వసించారు. పదేళ్లుగా ఏం చేయలేని వ్యక్తి.. ఇప్పుడేం చేస్తారనే కేసీఆర్‌ను ఓడించారు’’ అని కూనంనేని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని