Kejriwal: ప్రధాని కావాలనే ఉద్దేశం లేదు: కేజ్రీవాల్‌

విపక్షాల కూటమి ‘ఇండియా’ గెలిచినా.. ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

Published : 23 May 2024 00:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల కూటమి ‘ఇండియా’ గెలిచినా.. ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. విపక్షాల తరఫున ప్రధాని ఎవరనే విషయాన్ని ఎన్నికల ఫలితాల తర్వాతే కూటమి నిర్ణయిస్తుందన్నారు. ఈ నియంతృత్వ పాలన నుంచి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే తన లక్ష్యమన్నారు. పీటీఐ వార్త సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే విపక్షనేతలందరూ జైల్లో ఉంటారని వ్యాఖ్యానించారు.

విపక్ష కూటమి క్రమంగా 300 స్థానాల వైపు దూసుకెళ్తోంది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సుస్థిర ప్రభుత్వాన్ని విపక్షాల కూటమి కొనసాగిస్తుంది. తదుపరి ప్రధాని అయ్యే ఉద్దేశం లేదు. మేము (ఆప్‌) కేవలం 22 స్థానాల్లోనే పోటీ చేస్తున్నాం’ అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశ ప్రధానిగా రాహుల్‌ గాంధీని అంగీకరిస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ..‘అటువంటి చర్చే జరగలేదు. అది ఊహాజనిత ప్రశ్న. మే కలిసి కూర్చున్నప్పుడు చర్చిస్తాం’ అని అన్నారు.

మరోసారి ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్నికలు జరగవన్న కేజ్రీవాల్‌.. రష్యాలో జరుగుతున్న మాదిరిగానే ఇక్కడ పరిస్థితులు ఉంటాయన్నారు. విపక్ష నేతలందర్నీ పుతిన్‌ ఏవిధంగానైతే జైలుకు పంపిస్తున్నారో ఇక్కడా అదే జరుగుతుందన్నారు. తన విషయాన్ని ప్రస్తావిస్తూ.. పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ను జైలుకు పంపించి, ఆయన పార్టీ గుర్తును లాక్కున్నారని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని