Rajnath Singh: సీఏఏ వల్ల భారతీయులెవరూ పౌరసత్వాన్ని కోల్పోరు: రాజ్‌నాథ్ సింగ్

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుతో భారతీయులెవరూ తమ పౌరసత్వాన్ని కోల్పోరని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. 

Published : 08 Apr 2024 19:44 IST

చెన్నై: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుతో భారతీయులెవరూ తమ పౌరసత్వాన్ని కోల్పోరని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) తెలిపారు. ప్రతిపక్ష కాంగ్రెస్, డీఎంకే పార్టీలు ఈ అంశంపై ప్రజల్లో అనవసర గందరగోళం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు.

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కమలం పార్టీ పెద్దఎత్తున ప్రచారాలు నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా భాజపా నామక్కల్ నియోజకవర్గ అభ్యర్థి కేపీ రామలింగం చేపట్టిన ర్యాలీలో రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొన్నారు. రోడ్‌షో అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన భాజపా ప్రజలకు తాను ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందన్నారు. అయోధ్యలో రామమందిరం, ఆర్టికల్‌ 370 రద్దు, సీఏఏ వంటి హామీలే దానికి ఉదాహరణ అని పేర్కొన్నారు.

‘‘మేము పౌరసత్వ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చాము. అన్నట్లుగానే దానిని ఆచరణలోకి తెచ్చాము. సీఏఏ వల్ల భారతదేశంలోని హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, యూదులు..  ఇలా ఏ పౌరుడి పౌరసత్వమూ పోదని మేము హామీ ఇస్తున్నాము. మహిళలు అందరినీ మా తల్లి, చెల్లిగా భావిస్తాం. అందువల్లే ముస్లిం సోదరీమణులకు అన్యాయం జరగకుండా చూడాలని త్రిపుల్‌ తలాఖ్‌ను రద్దు చేశాము.’’  అని రక్షణశాఖ మంత్రి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని