రాజస్థాన్‌లో కాంగ్రెస్‌దే గెలుపు.. ఇదే ప్రూఫ్‌: అశోక్‌ గహ్లోత్‌

Ashok gehlot: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాబోతోందని అశోక్‌ గహ్లోత్‌ అన్నారు. దానికి తాజా ఈడీ దాడులే రుజువు అని పేర్కొన్నారు.

Published : 23 Oct 2023 18:59 IST

Ashok gehlot | జైపూర్‌: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో (Rajasthan Assembly elections) మరోసారి కాంగ్రెస్‌ విజయం తథ్యమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ (Ashok gehlot) అన్నారు. అందుకు రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దాడులే రుజువని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఈడీని ప్రయోగిస్తోందని గహ్లోత్‌ ఆరోపించారు.

రాజస్థాన్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌, 2021 పేపర్‌ లీకేజీకి సంబంధించిన విచారణలో భాగంగా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ కోచింగ్‌ సంస్థతో పాటు, కొందరు వ్యక్తుల నివాసాల్లో ఈడీ ఇటీవల సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఎక్స్‌ వేదికగా ఆయన ఓ పోస్ట్‌ పెట్టారు. రాజస్థాన్‌ ప్రజల హృదయాలు గెలవలేక.. ఈడీని భాజపా దుర్వినియోగం చేస్తోందన్నారు.

భాజపాకు సినీనటి గౌతమి రాజీనామా.. పార్టీ నేతలపై ఆరోపణలు!

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఇవ్వబోయే హామీల గురించి త్వరలోనే ప్రకటన చేస్తామని గహ్లోత్‌ చెప్పారు. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు అమలౌతున్నాయని, మధ్యప్రదేశ్‌లోనూ అమలు కాబోతున్నాయని చెప్పారు. ఇదే తరహాలో రాజస్థాన్‌లోనూ హామీలు అమలు చేస్తామని చెప్పారు. మోదీ తమ గ్యారెంటీలను కాపీ చేస్తున్నారని ఆరోపించారు. రాజస్థాన్‌లో 200 సీట్లకు గాను నవంబర్‌ 25న ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. భాజపా, కాంగ్రెస్‌ మధ్య ద్విముఖ పోరు నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని