DK ShivaKumar: 135 సీట్లు గెలిచినా సంతృప్తిగా లేదు: డీకే శివకుమార్‌

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తాను సంతృప్తిగా లేనని కేపీసీసీ అధ్యక్షుడు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం కార్యకర్తలు మరింత బాధ్యతతో పని చేయాలని కోరారు.

Published : 22 May 2023 01:59 IST

బెంగళూరు: తాజా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) 135 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. సంతృప్తిగా లేదని కేపీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ( DK Shivakumar) అన్నారు. బెంగళూరులో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మరింత చురుగ్గా పని చేయాలని పిలుపునిచ్చారు. ఇక నుంచి మరింత బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. 

కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 25 స్థానాలను గెలుచుకోగా.. కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఒక్కోస్థానంలో విజయం సాధించాయి. కాంగ్రెస్‌ పార్టీ బెంగళూరు రూరల్‌ను కైవసం చేసుకోగా.. హసన్‌ లోక్‌సభస్థానంలో జేడీఎస్‌ గెలుపొందింది. ఈసారి లింగాయత్‌, అహిందా వర్గాల ఓట్లు తమవైపు ఉండటంతో కాంగ్రెస్‌ ఉత్తమ ఫలితాలను ఆశిస్తోంది. మైనార్టీలు, దళితులు, వెనుకబడిన వర్గాలు అన్నీ అహిందా కిందికే వస్తాయి. భాజపాకు గత కొంతకాలంగా అనుకూలంగా ఉంటున్న లింగాయత్‌ వర్గీయులు.. తమ నాయకుడు బీఎస్‌ యడియూరప్పకు తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో తాజా ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేశారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రజలు ఇదే పంథాను కొనసాగిస్తారని కాంగ్రెస్‌ భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు