Omar Abdullah: ప్రధానిపై లాలూ వ్యాఖ్యలు.. కూటమికి సెల్ఫ్‌గోల్‌: ఒమర్‌ అబ్దుల్లా

ప్రధాని మోదీకి కుటుంబం లేదంటూ.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలతో కూటమి సెల్ఫ్‌గోల్‌ వేసుకుందని ఒమర్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.

Published : 08 Mar 2024 19:18 IST

శ్రీనగర్‌: ప్రధాని మోదీ (PM Modi)పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav) చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమి (India Alliance)కి నష్టాన్ని కలిగించాయని నేషనల్‌ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్మూ-కశ్మీర్‌ (Jammu-Kashmir) మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా (Omar Abdullah) అన్నారు. శుక్రవారం శ్రీనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈసంద్భరంగా రాష్ట్రంలో కూటమి సీట్ల సర్దుబాటు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

‘‘ప్రధానికి కుటుంబం లేదంటూ ఆయన (లాలూ ప్రసాద్‌ను ఉద్దేశించి) చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. వాటితో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అవి మనకే నష్టాన్ని కలిగిస్తాయి. ఇలాంటివి ఓటర్లను ప్రభావితం చేయలేవు. ప్రస్తుతం ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనే దానిపై దృష్టి సారించాలి. నిజానికి మేం సెల్ఫ్‌గోల్‌ వేసుకున్నాం. ఈ వ్యాఖ్యలు చేసిన గోల్‌ కీపర్‌ను తొలగించాలి లేదా వాటితో అవతలివారు లబ్ధి పొందుతుంటే చూస్తుండిపోవాలి’’ అని ఒమర్‌ అబ్ధుల్లా అన్నారు. ఇండియా కూటమితో సీట్ల సర్దుబాటు విషయంలో జమ్మూ-కశ్మీర్‌లో మూడో పార్టీకి అవకాశం లేదని పీపుల్స్ డెమోక్రటిక్‌ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తో కాకుండా మరొకరితో సీట్లు పంచుకోవాలని ముందే తెలిసుంటే.. ఇండియా కూటమిలో చేరేవాళ్లం కాదన్నారు. మరోవైపు ఎన్డీయేతో జట్టు కట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు