BRS: ఎమ్మెల్సీలుగా పల్లా, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డి రాజీనామా

ఎమ్మెల్సీలుగా పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డి రాజీనామా చేశారు.

Updated : 09 Dec 2023 13:27 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్సీలుగా పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీరు వరుసగా జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్‌, హుజూరాబాద్‌ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. నిబంధనల ప్రకారం 15 రోజులలోపు ఏదో ఒక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఖాళీ అయిన స్థానానికి ఎన్నికల కమిషన్‌ ఆరు మాసాలలోపు ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డిని కలిసి ఎమ్మెల్సీలుగా రాజీనామా చేస్తున్నట్లు లేఖలు అందజేశారు. వీరి రాజీనామాలను మండలి ఛైర్మన్‌ ఆమోదించారు. 

కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డి 2021లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో భారాస ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారయ్యారు. వీరికి 2027 నవంబరు వరకు పదవీకాలం ఉంది. డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి 2015లో తెరాస తరఫున నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇక 2021లోనూ ఇదే నియోజకవర్గం నుంచి రెండోసారి శాసనమండలి సభ్యుడిగా విజయం సాధించారు. రాజేశ్వర్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవీ కాలం 2027 వరకు ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు