Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పదవిపై పవన్‌ ఆసక్తి

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పవన్‌కల్యాణ్‌ సంసిద్ధత వ్యక్తం చేశారని ఇండియా టుడే ఛానల్‌ ఆదివారం వెల్లడించింది.

Updated : 10 Jun 2024 08:18 IST

ఇండియా టుడే ఛానల్‌కు వెల్లడి

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పవన్‌కల్యాణ్‌ సంసిద్ధత వ్యక్తం చేశారని ఇండియా టుడే ఛానల్‌ ఆదివారం వెల్లడించింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకారానికి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, ఆయన భార్య అనా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియా టుడే ఛానల్‌ రిపోర్టర్‌ పవన్‌ కల్యాణ్‌తో మాట్లాడారు. రిపోర్టర్‌ ప్రశ్నలు, ఆయన సమాధానాలు కొంత అస్పష్టంగా వినిపించినా పవన్‌ ఏం మాట్లాడిందీ వినపడలేదు. ఆ ప్రశ్నల సందర్భంగా ఇండియా టుడే రిపోర్టర్‌ వ్యాఖ్యానిస్తూ పవన్‌కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ ఛానల్‌లో ఈ విషయంపై స్క్రోలింగ్‌ ప్రసారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు జనసేన అధినేత వెల్లడించారని అందులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని