Pawan Kalyan: భారత క్రికెటర్‌ కంటే.. ఏసీఏకు వైకాపా నాయకుడే ముఖ్యమా?: పవన్‌

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)కు భారత క్రికెటర్ కంటే.. వైకాపా నాయకుడే ముఖ్యమా అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిలదీశారు.

Updated : 27 Feb 2024 13:49 IST

అమరావతి: ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)కు భారత క్రికెటర్ కంటే.. వైకాపా నాయకుడే ముఖ్యమా అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిలదీశారు. గాయాలను లెక్కచేయకుండా భారత జట్టు కోసం, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ జట్టు కోసం హనుమ విహారి.. తన క్రీడా శక్తినంతటినీ ధారపోశారని పవన్‌ కొనియాడారు. ఏపీ రంజీ జట్టు నాకౌట్‌ చేరడంలో అతడిది కీలక పాత్ర అని పేర్కొన్నారు.

‘‘వైకాపా నేత కారణంగానే అతడు కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. విహారి పట్ల ఏసీఏ చూపించిన తీరుకు చింతిస్తున్నా. మన ఆంధ్రా క్రికెట్ టీమ్ కెప్టెన్‌ను రాష్ట్ర క్రికెట్ సంఘం దారుణంగా అవమానించినప్పుడు.. ‘ఆడుదాం ఆంధ్రా’ లాంటి కార్యక్రమాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి లాభమేంటి?’’ అని జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హనుమ విహారికి భవిష్యత్తులో మంచి జరగాలని పవన్‌ ఆకాంక్షించారు. ఆటగాళ్లను గౌరవించడం తెలిసిన స్టేట్ క్రికెట్‌ అసోసియేషన్‌తో అతడు వచ్చే ఏడాది మళ్లీ ఆంధ్రా తరఫున ఆడతాడని విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని