Janasena: పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు.

Published : 29 Mar 2024 20:31 IST

మంగళగిరి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. తొలి విడతలో దాదాపు 10 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారని చెప్పారు. 

‘‘మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్‌ రెండో తేదీ వరకు ఆయన పోటీ చేస్తున్న పిఠాపురంలో ఉంటారు. బహిరంగ సభతో పాటు పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తారు. 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 9న పిఠాపురంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. 10న రాజోలు, 11న పి.గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమాలను జనసైనికులు, వీరమహిళలు విజయవంతం చేయాలి’’ అని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని