Pawan Kalyan: పిఠాపురంలో పవన్‌ పర్యటన.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) పర్యటన కొనసాగుతోంది.

Updated : 31 Mar 2024 14:10 IST

పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) పర్యటన కొనసాగుతోంది. రెండోరోజు పర్యటనలో భాగంగా పలు ఆలయాల్లో ఆయన ప్రత్యేకపూజలు నిర్వహించారు. పాదగయక్షేత్రంతో పాటు కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీ దేవి, దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శ్రీపాద శ్రీ వల్లభుడికి పూజలు చేశారు. పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని