Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు అస్వస్థత.. తెనాలి పర్యటన వాయిదా

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు చేపట్టాల్సిన తెనాలి పర్యటన వాయిదా పడింది. ఆయన ఆరోగ్యం సరిగా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు.

Updated : 03 Apr 2024 13:49 IST

తెనాలి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు చేపట్టాల్సిన తెనాలి పర్యటన వాయిదా పడింది. ఆయన ఆరోగ్యం సరిగా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. తెనాలిలో నిర్వహించాల్సిన రోడ్‌ షో, బహిరంగ సభ రద్దయ్యాయి. పవన్‌ కల్యాణ్‌ మంగళవారం ఎండలో 20 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. దీంతో వేడిమికి అస్వస్థతకు గురయ్యారు. మరోవైపు గురువారం నెల్లిమర్లలో నిర్వహించాల్సిన వారాహి బహిరంగ సభ వాయిదా పడింది. నెల్లిమర్ల సభ కొత్త తేదీని మళ్లీ ప్రకటిస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని