Pawan Kalyan: సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ శైలి అజరామరం: పవన్‌ కల్యాణ్‌

సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ శైలి అజరామరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు.

Updated : 28 May 2024 13:05 IST

అమరావతి: సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ శైలి అజరామరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ‘తెలుగు నుడికారానికి, తెలుగు నేలకు, తెలుగు జాతికి మరింత సొబగులు అద్దినవారిలో మన ఎన్టీఆర్‌ ఒకరని తెలుగువారు గర్వంగా చెప్పుకోవచ్చు. అలాంటి గొప్ప వ్యక్తి జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నాను. ఎన్టీఆర్‌ తెచ్చిన సంస్కరణలు, రూ.2కే కిలో బియ్యం చిరస్థాయిగా నిలిచిపోయాయి’’ అని పవన్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని