BJP: కేసీఆర్‌పై కోపంతోనే కాంగ్రెస్‌కు ఓటేసిన తెలంగాణ ప్రజలు: ఈటల

అసెంబ్లీ ఎన్నికల్లో భారాస అధినేత కేసీఆర్‌పై కోపంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారని భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు.

Updated : 26 Feb 2024 12:36 IST

గజ్వేల్‌: అసెంబ్లీ ఎన్నికల్లో భారాస అధినేత కేసీఆర్‌పై కోపంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారని భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. లోకసభ ఎన్నికల్లో మాత్రం భాజపాకే ఓటేస్తామని ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు. గజ్వేల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మహిళల ఆత్మగౌరవం నిలబెట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదే. 10 లక్షల మంది మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నాం. మహిళలు, యువత అంతా కలిసి మోదీని మరోసారి గెలిపించుకోవాలనుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్‌ పాలనలో ఎక్కడ చూసినా కుంభకోణాలే. మోదీ నాయకత్వంలో ఎలాంటి మచ్చ లేకుండా భాజపా ప్రభుత్వం కొనసాగుతోంది’’ అని ఈటల అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని