PM Modi: ‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్‌ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు.

Published : 19 Apr 2024 14:49 IST

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీల మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్‌ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. అయినా వారు మరలా ప్రజల ముందుకువస్తున్నారని విమర్శించారు.  యూపీలోని అమ్రోహాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన మోదీ ప్రతిపక్షాలు మా విశ్వాసంపై దాడి చేస్తున్నాయని ఆరోపించారు. అంతేకాకుండా అవి ‘అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపుల’ బుట్టను మోస్తూ ఓట్లు అడగడానికి బయల్దేరాయని అసహనం వ్యక్తంచేశారు.

అయోధ్యలోని రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుకలకు ఆహ్వానిస్తే సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ తిరస్కరించాయని ఆయన విమర్శించారు. ‘‘యూపీలో సమాజ్‌వాదీ పార్టీ 63 స్థానాల్లో, కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థికి ‘భారత్ మాతా కీ జై’ అని చెప్పడం కూడా కష్టం.’’ అని మోదీ దుయ్యబట్టారు.

2017 లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ పొత్తు పెట్టుకున్నారు. అయితే భాజపా వీరిని భారీ మెజారిటీతో ఓడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని