YSRCP: వైకాపా నేత గడ్డివాములో పెట్రో బాంబులు

పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో పెట్రో బాంబులు వెలుగులోకి వచ్చాయి. గ్రామంలో బుధవారం పోలీసుల తనిఖీలలో ఓ వైకాపా నేత గడ్డివాములో నాలుగు పెట్రో బాంబులు బయటపడ్డాయి.

Updated : 30 May 2024 09:36 IST

పోలీసులు స్వాధీనం చేసుకున్న పెట్రో బాంబులు 

బెల్లంకొండ, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో పెట్రో బాంబులు వెలుగులోకి వచ్చాయి. గ్రామంలో బుధవారం పోలీసుల తనిఖీలలో ఓ వైకాపా నేత గడ్డివాములో నాలుగు పెట్రో బాంబులు బయటపడ్డాయి. దీంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. కౌంటింగ్‌ రోజు అలజడులు సృష్టించేందుకు వాటిని దాచి ఉంచారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదే గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్‌ 21న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సోదరి రోడ్డుషో నిర్వహిస్తుండగా వైకాపా వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. రోడ్డుకు అడ్డంగా వైకాపా ప్రచార వాహనాలను నిలిపి.. ఇదేమిటని అడిగిన తెదేపా కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. అదేరోజు రాత్రి రెండింటి ప్రాంతంలో గ్రామంలోని తెదేపా కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఇప్పటికైనా గ్రామంలో అల్లర్లకు పాల్పడేవారిని బైండోవర్‌ చేయకపోతే కౌంటింగ్‌ రోజు దాడులు చేసే అవకాశముందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. గడ్డివాము పరిసరాల్లోని నివాసితులను విచారిస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై రాజేష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని