AP news: రాష్ట్రంలోనూ ఫోన్లు ట్యాపింగ్‌ చేశారు

తెలంగాణలో మాదిరిగానే రాష్ట్రంలోనూ ప్రముఖ నాయకుల ఫోన్లను ట్యాపింగ్‌ చేశారని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ధ్వజమెత్తారు.

Published : 06 Jun 2024 04:04 IST

మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌

సమావేశంలో మాట్లాడుతున్న డొక్కా మాణిక్యవరప్రసాద్, పక్కన ఎమ్మెల్సీ లక్ష్మణరావు, లక్ష్మణరెడ్డి, నర్రా శ్రీనివాసరావు 

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: తెలంగాణలో మాదిరిగానే రాష్ట్రంలోనూ ప్రముఖ నాయకుల ఫోన్లను ట్యాపింగ్‌ చేశారని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ధ్వజమెత్తారు. గుంటూరులోని జన చైతన్య వేదిక కార్యాలయంలో ఎన్నికల ఫలితాల విశ్లేషణపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలువురి ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాపింగ్‌ చేసి, వారి వ్యక్తిగత సంభాషణలను రికార్డు చేశారని పేర్కొన్నారు. వాటి ఆధారంగానే వైకాపా సర్కారు బెదిరింపులకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా తన ఫోన్‌ను కూడా ట్యాప్‌ చేశారని, దీనిపై నూతన ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరారు. కులాలు, ప్రాంతాల మధ్య వైకాపా విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని ఇటీవల ఎన్నికల్లో ఓటర్లు తిరస్కరించారని చెప్పారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో లేకపోవడం.. మంత్రులకు నిర్ణయాధికారం లేకపోవడం, స్థానిక సంస్థలకు నిధులు కేటాయించకపోవడంతోనే వైకాపా ఘోర ఓటమిని చవిచూసిందని విశ్లేషించారు. వైకాపా సర్కారు పోలవరం, రాజధాని నిర్మాణాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి చర్యలను నిరసిస్తూ ఓటర్లు తీర్పు ఇచ్చారని జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని