PM Modi: ఎన్టీఆర్‌ ఎంతో దార్శనికత గల నాయకుడు: ప్రధాని మోదీ

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ఎంతో దార్శనికత గల నాయకుడని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.

Updated : 28 May 2024 14:43 IST

దిల్లీ: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ఎంతో దార్శనికత గల నాయకుడని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా ఆయన ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా స్మరించుకున్నారు. 

‘‘ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన.. ఎంతో దార్శనికత గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఎన్టీఆర్‌ చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. తెరపై ధరించిన పాత్రలను, ఆయన నాయకత్వ పటిమను ప్రజలు ఇప్పటికీ తలచుకుంటారు. ఎన్టీఆర్‌ కలలుగన్న సమాజం కోసం మేము నిరంతరం పని చేస్తాం’’ అని మోదీ పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు కలిసి పనిచేద్దాం: మోదీ పోస్ట్‌కు చంద్రబాబు స్పందన

మోదీ చేసిన పోస్ట్‌కు తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ఎన్టీఆర్‌ ఆశయసాధనకు కలిసి పనిచేద్దామన్నారు. ‘‘ఎన్టీఆర్ తెర ముందు.. తెర వెనకా ఓ లెజెండే. ఆయన అందించిన నిస్వార్థ ప్రజాసేవ మనందరికీ స్ఫూర్తి. భవిష్యత్తు తరాలకు బాటలు వేసే విధంగా అందరి హృదయాల్లో అది ప్రకాశిస్తోంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు